Thursday, November 19, 2026

ఉప్పుల మల్సూర్ | CLASS 10th TELUGU

ఉప్పుల మల్సూర్
సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామంలో 1928లో జన్మించిన ఉప్పుల 'మల్సూర్ అతి సామాన్య జీవితం గడిపిన రాజకీయ నాయకుడు. నమ్మిన సిద్ధాంతాన్ని జీవితాంతం ఆచరించాడు. నిజాం సైన్యానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణా సాయుధపోరాటంలో ఆయుధం చేతబూని ఉత్సాహంగా పాల్గొన్నాడు. స్వాతంత్య్రానంతరం నాలుగు సార్లు ఎమ్మెల్లేగా గెలిచిన మల్సూర్ తనకు నెలనెలా వచ్చే జీతాన్ని కూడా పార్టీకే ఇచ్చేవాడు. స్వయంగా తను చెప్పులు కుట్టగా వచ్చిన డబ్బులతోనే జీవితం గడిపేవాడు. మల్సూర్ భార్య కూడా కూలీపనికి వెళ్ళి భర్తకు చేదోడుగా ఉండేది. దళిత ఆణిముత్యంగా పేరుగాంచిన ఉప్పుల మల్సూర్ 1999 జనవరి 13న మరణించాడు. ఆయన మరణానంతరం వారి పిల్లలు తమ సొంత ఇంటిని మల్సూర్ జ్ఞాపకార్థం పాఠశాలకు ఇచ్చారు.

No comments: